కోవిద్-19 రోగిని మొదటి సారి ఆ మెషీన్ కాపాడిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Aug 2020 8:39 AM IST
కోవిద్-19 రోగిని మొదటి సారి ఆ మెషీన్ కాపాడిందా..?

ముంబై: నగరంలో మొదటి పేషెంట్ కోవిద్-19 అత్యవసర చికిత్స నుండి బయటపడ్డాడు. రెండు వారాల పాటూ ఎక్స్ట్రాకార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజేనేషన్ (ఈసిఎంఓ) extracorporeal membrane oxygenation (ECMO) ద్వారా లైఫ్ సపోర్ట్ అందించడంతో అతడు బ్రతకగలిగాడు. దేశ వ్యాప్తంగా ఏడు మంది ఈసిఎంఓ సపోర్ట్ ద్వారా బ్రతికి ఉంటారని అధికారులు చెబుతున్నారు. వెంటిలేటర్ సపోర్ట్ ఫెయిల్ అయిన వారికి ఈసిఎంఓ సపోర్ట్ పని చేస్తోందని వైద్యులు వెల్లడించారు.

ఈసిఎంఓ సపోర్టులో ఉపయోగించే మెషీన్ పేషెంట్ రక్తాన్ని ఆక్సిజన్ తో కలిసి పంపు చేస్తుంది.. అలా పంపు చేసిన సమయంలో కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. ఇలా చేయడం వలన గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం జరుగుతుంది. దీంతో రోగి ప్రాణాపాయం నుండి బయటకు వస్తాడు.

వైరస్ ను జయించిన గలడన్న చిన్న ఆశతో గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి వెంటిలేటర్ మీద ముంబై నగరానికి తీసుకువచ్చారు. మలాద్ లోని రిద్ధి వినాయక ఆసుపత్రిలో అతన్ని ఈసిఎంఓ సపోర్టుపై ఉంచారు. చాలా ఆసుపత్రుల్లో ఈసిఎంఓ సపోర్టు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన కోవిద్-19 పేషెంట్స్ కు ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఈసిఎంఓ సపోర్టుపై ఉంచాలంటే 50వేల రూపాయల నుండి లక్ష రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కొన్ని వారాల పాటు కూడా ఉంచాల్సి ఉంటుంది.

ఈ ఆసుపత్రిలో పది మంది రోగులకు ఈసిఎంఓ సపోర్టు అందించగా అందులో ఎనిమిది మంది మరణించారు. ఒకరు బ్రతకగలిగారు. ఇంకొక వ్యక్తికి ట్రీట్మెంట్ ను అందిస్తూ ఉన్నారు. ఈసిఎంఓ సపోర్టు ద్వారా కోవిద్-19 పాజిటివ్ పేషెంట్స్ బ్రతకడం భారత్ లో 20-25 శాతం మాత్రమే ఉంది. ఒక్క ప్రాణాన్ని అయినా కాపాడినందుకు చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు ఇంటెన్సివిస్ట్ ప్రణయ్ ఓజా. వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉన్నప్పుడు బ్రతకడానికి అవకాశం లేదు అని చెప్పిన తర్వాత ఈసిఎంఓ సపోర్టు ద్వారా బ్రతికించగలడం పెద్ద విజయమనే చెబుతూ ఉన్నారు.

14 రోజుల పాటూ ఈసిఎంఓ సపోర్టు మీద ప్రాణాలు పోసుకున్న గుజరాత్ వ్యక్తి తిరిగి తన స్వస్థలానికి వెళ్తున్నారు. ఈసిఎంఓ సపోర్టు ద్వారా ప్రయత్నించినప్పటికీ 80 శాతం మంది మరణిస్తూ ఉన్నారని అతి తక్కువ మంది బ్రతుకుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. రోగులను ముందుగానే గుర్తించి ఏయే అవయవాలు ఫెయిల్యూర్ అయ్యాయో అన్నది గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా బ్రతికించవచ్చని ఇంటెన్సివిస్ట్ రాహుల్ పండిట్ చెబుతూ ఉన్నారు. లంగ్ రివర్సిబిలిటీ అన్నది జరిగితే బ్రతికించడం వీలవుతుందని చెబుతున్నారు. సరైన సమయంలో ఈసిఎంఓ సపోర్టును ఉపయోగిస్తే బ్రతికించే వీలు ఉంటుందని చెబుతున్నారు.

Next Story