ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మ‌హ‌త్య‌

By Medi Samrat  Published on  13 Oct 2019 4:41 PM IST
ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ : ప్రేమ పేరుతో సొంత మరదలినే మోసం చేశాడు ఓ బావ‌. దీంతో మనస్తాపం చెందిన ఆ యువ‌తి ఆత్మహత్య చేసుకుంది. వివ‌రాళ్లోకెళితే.. హైదరాబాద్ లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుధాక‌ర్ అనే వ్య‌క్తి.. త‌న‌ సొంత మరదలు మల్లేశ్వరిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. పెళ్లిచేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. ఆ త‌రువాత మాట‌మార్చి.. ఓ మైనర్ బాలిక‌ను పెళ్లి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన మల్లేశ్వరి ఆత్మహత్యాయ‌త్నం చేసింది. దీంతో యువ‌తి బందువులు గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story