లాక్‌డౌన్ 5.0: మార్గదర్శకాలకు సిద్ధమవుతున్న కేంద్రం.. ఎలా ఉంటుందంటే..!
By సుభాష్ Published on 30 May 2020 8:20 AM ISTభారత్‌లో కరోనా మహమ్మారి విశ్వరూపం దాల్చుతోంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. కరోనా కేసులు రోజురోజుకు తీవ్ర స్థాయిలో నమోదువుతున్నాయి. ఇక మే 31తో లాక్‌డౌన్ 4.0 ముగియనుంది. ఇక మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగించేందుకు కేంద్రం మొగ్గుచూపుతోంది. కరోనా తీవ్రంగా పెరుగుతుండటంతో నిజ నిజీవితంలో మాస్కులు వాడని వారు కూడా ఇప్పుడు వాడుతున్నారు. ప్రజలే స్వయంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బస్సులను తిరిగేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా జనాలు పెద్దగా ఎక్కడం లేదు. భౌతిక దూరం పాటించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మే 31తో 68 రోజుల లాక్‌డౌన్ పూర్తవుతున్న క్రమంలో కేంద్రం లాక్‌డౌన్ 5.0 ప్రారంభించి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, మెట్రో సర్వీసులను ప్రారంభించేందు అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చినా.. నిబంధనలు మాత్రం తప్పనిసరి కానుంది. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఆలయాలు, మసీదులు, చర్చీలు వంటి ప్రార్థనా స్థలాలన్నీ తెరిచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అక్కడ కూడా నిబంధనలు తప్పనిసరి. అదే సమయంలో ఆరోగ్య సేతు యాప్ అందరి మొబైళ్లలో ఉండేలా చర్యలు చేపట్టనుంది కేంద్రం.
13 నగరాలకు కేంద్రం ప్రత్యేక దృష్టి
ఇక కేంద్రం ప్రస్తుతం కరోనా సోకిన 13 నగరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. వాటిలో హైదరాబాద్ కూడా ఉంది. దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో 70శాతం ఆ నగరాల్లోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణే, థానే, కోల్‌కతా, జైపూర్, హౌరా, బోధపూర్, తమిళనాడు ఉన్నాయి. ఈ నగరంలో కఠినమైన నిబంధనలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి.. కేంద్రం అన్ని రకాల బస్సులు, మెట్రో రైళ్లు, షాపింగ్ మాల్స్ వంటి వాటికి లాక్‌డౌన్ నుంచి పూర్తిగా అనుమతులు ఇచ్చినా.. ఇప్పుడే జనాలేమి వెళ్లరని, కరోనా భయంతో పెద్దగా రద్దీ ఉండదని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ప్రజల వద్ద పెద్దగా డబ్బులు లేవు.. కొన్ని నెలల పాటు మాల్స్‌కు ఇబ్బందులు తప్పవంటున్నారు. అలాగే మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. జనాలు ఎక్కేందుకు ముందుకు రారు. పెద్దగా ప్రయాణం చేయరు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తారనే ఉద్దేశంతో సడలింపులు ఇచ్చే అవకాశాలున్నాయి.