దేశంలో కరోనా కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లాక్‌డౌన్‌కు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.

మే 31వ తేదీ వరకూ మెట్రో, విమనా సర్వీసులు బంద్‌ ఉండనున్నాయి. అలాగే మే 31 వరకూ కాలేజీలు, స్కూళ్లకు ఎలాంటి అనుమతి లేదు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లపై కూడా నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. సినిమా హాల్స్‌, షాపింగ్‌ మాల్స్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌పై నిషేధం కొనసాగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో తెరిచేది లేదని తేల్చి చెప్పింది. కాగా, ప్రజా రవాణాపై కూడా స్పందించింది. రాష్ట్రాల పరస్పర అంగీకారంతో ప్రజారవాణాకు అనుమతి ఇచ్చింది.

అలాగే దేవాలయాలు కూడా మూసివేయాలని ఆదేశించింది. రాజకీయ, మతపరమైన సభలపై నిషేధం కొనసాగనుంది. కంటైన్‌మెంట్‌, రెడ్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్లలో సడలింపుల నిర్ణయం రాష్టాలకే వదిలేసింది కేంద్రం. అంతేకాకుండా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ ఉంటుందని స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో కేవలం నిత్యావసరాలకే అనుమతి ఉంటుంది. ప్రేక్షకులు లేకుండా స్పోర్స్ట్ కాంప్లెక్స్‌, స్టేడియాలకు అనుమతి ఇచ్చింది. అలాగే ఫుడ్‌ హోం డెలివరీకి చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *