తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం.. రాకపోకలు బంద్‌

By సుభాష్  Published on  17 May 2020 6:15 AM GMT
తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం.. రాకపోకలు బంద్‌

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మరో ముందడుగు వేసింది. దేశంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్‌, ఏపీల నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వాహనాల రాకపోకలను నిషేధించింది. ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వాందరికీ మూడు రోజుల పాటు ప్రభుత్వం పాసులను జారీ చేసింది. తదుపరి అదేశాలు వచ్చే వరకూ పాసులను జారీ చేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాగా, దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌, ఏపీ రాష్ట్రాల్లో కరోనా పాజిటవ్‌ కేసులు, మరణాల సంఖ్య అధికంగా నమోదవుతున్నాయి. అలాగే కర్నూలు, గుంటూరు జిల్లాలో కరోనా అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో రాకపోకలు భారీగా సాగుతుండటంతో కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక లాక్‌డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సుమారు 80వేలకుపైగా తెలంగాణ వాసులు చిక్కుకుపోయారు. వారందరూ అత్యవసర పాసుల ద్వారా తిరిగి తెలంగాణకు చేరుకోనున్నారు. ఇక నుంచి వచ్చిన వారికి చెక్‌ పోస్టుల వద్దనే థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు.

కాగా, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య తీవ్రంగా ఉండేది. గత వారం రోజుల నుంచి ఆయా జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు లేకుండా తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే మళ్లీ కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. కాకపోతే ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. ఇతర జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు. తగ్గుముఖం పట్టినా కరోనా కేసుల సంఖ్య మళ్లీ అమాంతంగా పెరిగిపోయాయి. గత వారం రోజుల నుంచి నమోదువుతున్న పాజిటివ్‌ కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండటంతో హైదరాబాద్‌ వాసులకు మరింత ఆందోళన కలిగిస్తోంది.

Next Story