మద్యం తరలిస్తూ పట్టుబడ్డ కాంగ్రెస్‌ కీలక నేతలు

By సుభాష్  Published on  23 April 2020 2:01 AM GMT
మద్యం తరలిస్తూ పట్టుబడ్డ కాంగ్రెస్‌ కీలక నేతలు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పట్టిపీడిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు, స్వచ్చంద సేవా సంస్థలు, ఇతరులు పేదలకు తోచిన సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ పార్టీకి చెందిన కీలక నేతలు మద్యం తరలిస్తూ ఢిల్లీ పోలీసులకు చిక్కాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూత్‌ కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తితో పాటు కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ నేతలు మద్యం తరలిస్తూ అడ్డంగా బుక్కైపోయారు. వీరు హర్యానా నుంచి ఢిల్లీకి మద్యం తరరలిస్తుండగా, పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. పట్టుకున్న మద్యాన్నిసీజ్‌చేసి వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇది వరకూ కూడా కొందరు కాంగ్రెస్ నేతలు మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు.

మరో వైపు కాంగ్రెస్‌ కార్యకర్తలు మద్యం సరఫరా చేయడంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర సేవల పాస్‌లను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నేతలపై పార్టీ పరంగా కూడా చర్యలు చేపట్టి దర్యాప్తు చేపట్టాలన్నారు.

Next Story