క్యారెట్ తినడం వల్ల బోలేడన్ని ఆరోగ్య లభాలు ఉన్నాయి. క్యారెట్‌లోని బీటా కెరోటిన్ విటమిన్ 'ఎ'గా మారి కంటి చూపునకు మేలు చేస్తుంది. రోజూ ఒక క్యారెట్ తింటే చర్మం కాంతివంతంగా మారుతుంది. రక్తహనీత సమస్యక క్యారెట్ దివ్య ఔషధంగా పని చేస్తుంది. ప్రతి రోజూ తింటే విటమిన్ బి6, విటమిన్ -సి శరీరానికి అందుతాయి. ఇవి రెండూ రోగనిరోధక శక్తిని పెంచి ఎలాంటి ఇన్ఫెక్షన్లు వ్యాధులు రాకుండా కాపడతాయి. క్యారెట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మలబద్ధం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. రక్త ప్రవహంలోకి కొలెస్ట్రాల్ చేరకుండా అడ్డుకుంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పెద్ద పేగు క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుంది. క్యారెట్‌లో ఉండే ఫొలేట్, పొటాషియం వంటి పోషకాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. చిగుళ్ల వ్యాధి, దంతక్షయం వంటివి రాకుండా క్యారెట్ కాపాడుతుంది. అయితే ప్రతి రోజూ పెద్ద క్యారెట్ అయితే ఒకటికి మించి తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.