'పెద్దల మాట చద్దన్నం మూట' అనే నానుడి మనం వినే ఉంటాం. చద్దన్నంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్లే ఈ పోలిక పెట్టారు. ముఖ్యంగా వేసవిలో చద్దన్నం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో ప్రతి రోజూ ఉదయాన్నే చద్దన్నం తింటే వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు. చద్దన్నంలో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్‌లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉల్లిపాయను నంచుకుని తింటే శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది.
చద్దన్నం తింటే తక్షణ శక్తి వస్తుంది. ఇది డీహైడ్రేషన్, అలసట, బలహీనతను దూరం చేసి శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది. మలబద్ధకం, నీరసం తగ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుంది. పేగుల్లోని ఆరోగ్య సమస్యలను సైతం తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చద్దన్నం తింటే ఎముకల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. అలాగే పలు రకాల ఇన్‌ఫెక్షన్లు, కొన్ని ప్రమాదకరమైన రోగాల ముప్పు తగ్గుతుందనేది నిపుణుల అభిప్రాయం.