పాలకూరతో మహిళలకు ఎంతో మేలు

కూరగాయలతో పాటు ఆకు కూరలను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అన్ని రకాల ఆకు కూరలూ స్త్రీ, పురుషులిద్దరికీ మేలు చేస్తాయి.

By అంజి
Published on : 14 Feb 2025 12:20 PM IST

Health Benefits, eating, Palakura, women, Lifestyle

పాలకూరతో మహిళలకు కలిగే మేలు

కూరగాయలతో పాటు ఆకు కూరలను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అన్ని రకాల ఆకు కూరలూ స్త్రీ, పురుషులిద్దరికీ మేలు చేస్తాయి. అయితే పాల కూరతో మహిళలకు మరింత మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్త్రీలలో హార్మోన్ల మార్పుల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిని అదుపులో ఉంచడానికి పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యువతులు, మహిళల్లో ఐరన్‌ లోపం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడుతుంది.

పాలకూరలో ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది. అందుకే దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. గర్భిణీలు పాలకూరను తినడం వల్ల తల్లీ, బిడ్డలు ఇద్దరికీ మేలు జరుగుతుంది. పాలకూరలో మెగ్నిషీయం ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. కీళ్ల నొప్పుల సమస్యను తగ్గిస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే పాలకూరలో ఉండే విటమిన్‌ కే ఉంటుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీని వల్ల మహిళల్లో తీవ్ర రక్తస్రావం ముప్పు తగ్గుతుంది.

Next Story