వ్యాయామం తర్వాత ఇలాంటి ఫుడ్‌ తీసుకుంటున్నారా?.. అయితే ప్రయోజనం వృథా

మనం మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంతో ఉండాలంటే వ్యాయామం అవసరం. అయితే వ్యాయామం చేసిన తర్వాత మనం తినే ఆహారంపైనే దాని ప్రయోజనం ఆధారపడి ఉంటుంది.

By అంజి
Published on : 5 Aug 2025 10:18 AM IST

eating, foods, exercise, health benefits, life style

వ్యాయామం తర్వాత ఇలాంటి ఫుడ్‌ తీసుకుంటున్నారా?.. అయితే ప్రయోజనం వృథా

మనం మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంతో ఉండాలంటే వ్యాయామం అవసరం. అయితే వ్యాయామం చేసిన తర్వాత మనం తినే ఆహారంపైనే దాని ప్రయోజనం ఆధారపడి ఉంటుంది. అందుకే వ్యాయామం అనంతరం మనం తినే ఆహారం కూడా ముఖ్యమే. కొన్ని ఆహార పదార్థాలను వ్యాయామ తర్వాత తినకపోవడం మంచిదని ఫిట్‌నెస్‌ నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బరువు తగ్గేందుకు జిమ్‌కు వెళ్లేవారు వ్యాయామం తర్వాత మాంసాహారానికి బదులుగా ఇతర ప్రోటీన్‌ ఫుడ్‌ తీసుకోవడం మంచిది. వ్యాయామం తర్వాత వేయించిన ఆహారాలు, వేరుశనగ వంటి వాటిని తినకూడదు.

వ్యాయామం తర్వాత కూల్ డ్రింక్స్‌ తాగకూడదు. చక్కెర లేకుండా పండ్ల రసం తాగడం మంచిది. ఫాస్ట్‌ ఫుడ్‌ తీసుకోవద్దు. ఇవి తినడం వల్ల అప్పటి వరకు వ్యాయామం చేసిన ఫలితం మనకు దక్కదు.

వ్యాయామం తర్వాత గుడ్లను ఉడకబెట్టి తినడం మంచిది. అంతే తప్ప వేయించి, ఆమ్లెట్‌ వేసి తినకూడదు. జిమ్‌కి వెళ్లి వచ్చిన తర్వాత స్వీట్స్‌ తినొద్దు. వీటి తయారీకి ఉపయోగించే చక్కెర హాని చేస్తుంది. వ్యాయామం ముగించాక బాగా చల్లగా ఉండే నీరు వద్దు. కొంత గ్యాప్‌ తీసుకుని సాధారణ నీరు తాగాలి. మరీ ఎక్కువగా కాకుండా ట్రైనర్‌ సూచించిన మేరకు తాగాలి.

Next Story