ఎంత‌కాలం న‌టిస్తావ్.. ఎంత‌మంది అమ్మాయిల‌ జీవితాల‌తో ఆడుకుంటావ్.?

By Medi Samrat  Published on  13 July 2020 2:44 PM GMT
ఎంత‌కాలం న‌టిస్తావ్.. ఎంత‌మంది అమ్మాయిల‌ జీవితాల‌తో ఆడుకుంటావ్.?

భ‌ర్త వేధింపులు తాళ‌లేక ఆత్మహత్య చేసుకున్న‌‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లావణ్య ఘ‌ట‌న‌ తెలుగు రాష్ట్రాల‌లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా లావ‌ణ్య‌ ఆత్మహత్యకు ముందు లావణ్య రికార్డు చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో లావణ్య చెప్పుకున్న బాధలు ప్ర‌తి ఒక్క‌రిని కంటతడి పెట్టించేలా ఉన్నాయి. పైకి ప్రేమ న‌టిస్తూ తన భర్త వెంకటేశ్ త‌న‌ను ఏ విధంగా మోసం చేశాడో లావణ్య ఈ వీడియోలో వివరించారు.

ప్రేమించానన్నావ్.. నా కోసం ఏదైనా చేస్తానని చెప్పావు. నీపై నమ్మకంతో నా తల్లిదండ్రులను ఎదురించి మరీ నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్లైన తర్వాత నీ నిజస్వరూపం తెలిసింది. బయటకు మంచిత‌నం న‌టిస్తూ.. ఎన్నో నీతులు చెప్తావ్.. నేను గర్భిణిగా ఉన్నప్పుడు.. నువ్వు మరోకరితో సంబంధం పెట్టుకున్నావు.. కానీ నీకు అసలు వ్యక్తిత్వం ఉందా?. నా ముందే అమ్మాయిల‌తో వీడియో కాలింగ్‌లో మట్లాడేవాడిని. అమ్మాయిలతో చెడు తిరుగుళ్లు తిర‌గొద్ద‌ని చెప్పినందుకు నన్ను హింసించావు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిట్ట‌డం.. కొట్ట‌డం ఇందుకోసమేనా నన్ను పెళ్లి చేసుకుంది.?

నీ గురించి తెలిసిన రోజే నిన్ను వదిలేసి ఉంటే బాగుండేది.. కానీ అలా చేయకపోవడం నేను చేసిన తప్పు. నీకు, నీ కుటుంబానికి బంధుత్వాల గురించి తెలియవు. కుక్కలకైనా తిన్న విశ్వాసం ఉంటుంది.. వండిపెట్టినందుకు నీకు క‌నీసం ఆ విశ్వాసం కూడా లేదు. తప్పు చేస్తుంటే నీ తండ్రే నీకు మద్దతుగా నిలుస్తున్నాడు.

పైకి మంచిత‌న‌మ‌నే ఒక మాస్కు వేసుకుని ఎంత‌కాలం న‌టిస్తావ్‌.. ఎంత‌మంది జీవితాల‌తో ఆడుకుంటావ్.. ఎంత మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తావు. శిరీష అనే అమ్మాయితో తిరుగుతున్నావు. నేను ఇక ఉండను కాబట్టి.. కనీసం ఆమెను అయినా పెళ్లి చేసుకో. మరోక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు.

ఎన్నో ఆశలతో నీతో జీవితాన్ని ఊహించుకున్నాను. పెళ్లి తర్వాత నీ నిజ‌స్వ‌రూపం తెలిసింది. నేను సంపాందించిన‌దంతా నీ పేరున వేసుకున్నావు. నీకు ఉద్యోగం లేకపోయినా ఏళ్ల తరబడి పోషించాను. నీకు ఉద్యోగం వచ్చాక హింసించడం మొదలు పెట్టావు. నెల‌కు రూ. 78000 నా జీతం. కావాలంటే నా పే స్లిప్‌లు చూడండి. నేను సంపాదించింది ఎంతో తెలుస్తోంది.

డాడీ వీడి వద్ద 48 లక్షలు తీసుకోండి.. ఒక అబ్బాయిని దత్తత తీసుకుని మంచిగా పెంచండి. మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు.. ఎంతో ఇచ్చారు.. కానీ మోసం చేసి వెళ్లిపోతున్నాను. మీ అందరు అంటే నాకు చాలా ఇష్టం.. ఈ వెధవ అన్న నాకు చాలా ఇష్టం.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.. న‌న్ను క్షమించాలని లావ‌ణ్య మాట్లాడిన మాట‌లు ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రిని క‌న్నీరు పెట్టిస్తున్నాయి.

Next Story
Share it