కూకట్‌పల్లిలో దారుణం.. యువకుడి దారుణ హత్య

By అంజి  Published on  21 Jan 2020 8:30 AM GMT
కూకట్‌పల్లిలో దారుణం.. యువకుడి దారుణ హత్య

హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఖైత్లాపూర్‌లో సుధీర్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు స్నేహితులు సోమవారం అర్థరాత్రి నిర్మానుష్య ప్రదేశంలో మద్యం సేవించారు. అదే సమయంలో మాట మాటా పెరిగి స్నేహితుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సాబెర్‌ అనే యువకుడు సుధీర్‌ మద్యం సీసాతో పొడిచి చంపినట్టు పోలీసులు తెలిపారు. మృతుడు సుధీర్‌ తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Kukatpally crime news Kukatpally crime news

Kukatpally crime news

Next Story
Share it