పైన వరి పొట్టు.. లోన గంజాయి

By Newsmeter.Network  Published on  21 Jan 2020 8:39 AM GMT
పైన వరి పొట్టు.. లోన గంజాయి

గంజాయి రవాణాను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నా కేటుగాళ్లు వివిధ పద్దతుల్లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. పెద్ద అంబర్ పేట వద్ద గంజాయి రవాణా చేసే పద్దతిని చూస్తే విస్తుపోవాల్సిందే. ఓ లారీలో పైన వరి పొట్టు నింపి కింద గంజాయి తరలిస్తులిండగా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే..

పెద్ద అంబర్‌పేట వద్ద వరి పొట్టు లోడుతో వస్తున్నలారీనీ విశ్వసనీయ సమాచారం మేరకు డీఆర్‌ఐ(డైరెక్టర్‌ ఆఫ్‌ ఇంటలిజెన్స్‌) అధికారులు తనిఖీ చేశారు. తీరా లారీలో చూస్తే, పైభాగంలో వరి పొట్టు, లోపల మొత్తం గంజాయితో నిండి ఉంది. దీంతో అధికారులు నివ్వెరపోయారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 1335 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ లో దీని విలువ రూ.2కోట్లకు పైగా ఉంటుందని అన్నారు. అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా భద్రాచలం నుంచి బీదర్ కు గంజాయిని తరలిస్తున్నారు.

Next Story