ఆయనదో అంతర్జాతీయ పార్టీ.. అందుకే బీజేపీతో
By సుభాష్
ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన జనసేనపై సెటైరికల్‌గా స్పందించారు. జనసేన పార్టీ అంతర్జాతీయ పార్టీ అవుతుందేమోనని వ్యాఖ్యనించారు. ఏపీలో జనసేన-బీజేపీ పొత్తులపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కేటీఆర్. వీరిద్దరి పొత్తులపై ఇప్పుడే స్పందించలేనని అన్నారు. అయినా పక్కరాష్ట్రంలో పవన్ కల్యాణ్ ఏం చేస్తే తమకేంటని, ఆ విషయాలను ఏపీ ప్రజలు చూసుకుంటారని చెప్పారు. కాగా, ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. విజయవాడలో జరిగిన ఇరు పార్టీల సమావేశంలో పొత్తుల అంశంపై అధికారిక నిర్ణయం తీసుకున్నారు. 2014 ఎన్నికలే లక్ష్యంగా వీరు పొత్తులు కుదుర్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వీరి పొత్తులపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలను ఏర్పాటు చేశామని అన్నారు.