ఏపీలో కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా ఖమ్మం జిల్లా మధిర వాసులుగా గుర్తించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం గోపవరం నుంచి 30 మంది వరకు ట్రాక్టర్లలో దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

సుభాష్

.

Next Story