ద‌ర్శ‌కుడిగా జ‌బ‌ర్ధ‌స్థ్ 'కిరాక్ ఆర్పీ'

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Aug 2020 2:02 PM GMT
ద‌ర్శ‌కుడిగా జ‌బ‌ర్ధ‌స్థ్ కిరాక్ ఆర్పీ

తెలుగు కామెడీ టీవీ షోలు ‘జ‌బ‌ర్ధ‌స్థ్’, ‘అదిరింది’ ద్వారా తెలుగు ప్ర‌జ‌ల‌కి ద‌గ్గ‌రైన న‌టుడు కిరాక్ ఆర్పీ.. ద‌ర్శ‌కుడిగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాడు. గ‌త‌ కొన్నాళ్ల నుండి ద‌ర్శ‌కుడిగా మారేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న ఆర్పీ.. ఎట్ట‌కేల‌కు ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.

ప్ర‌ముఖ న‌టులు జేడీ చక్ర‌వ‌ర్తి, ప్ర‌కాశ్ రాజ్, రావు ర‌మేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శ్రీ ప‌ద్మ‌జ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై కోవూరు అరుణాచ‌లం నిర్మిస్తున్న చిత్రానికి ఆర్పీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఆదివారం సాయంత్రం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూజా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌గా.. కార్య‌క్ర‌మానికి మెగాబ్ర‌ద‌ర్‌ నాగ‌బాబు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యి.. చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు.ఈ సంద‌ర్భంగా ఆర్పీ మాట్లాడుతూ‌.. సస్పెన్స్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంగా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కుద‌ర‌డంతో ద‌ర్శ‌కునిగా ఆడియెన్స్ ముందుకి రావ‌డానికి నిశ్చ‌యించుకున్నానని అన్నారు. ఈ సినిమాలో జేడీచ‌క్ర‌వ‌ర్తి కీల‌క పాత్ర పోషించ‌‌డానికి అంగీక‌రించ‌డం చాలా ఆనందంగా ఉందని.. సినిమాలో జే.డి. పాత్ర చాలా విల‌క్ష‌ణంగా ఉంటుందని తెలిపారు. హైద‌రాబాద్, నెల్లూర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమాకు.. చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తున్నారు.

Next Story