కేటీఆర్‌కు రాఖీ కట్టిన చెల్లెలు కవిత
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2020 5:56 AM GMT
రక్షాబంధన్(రాఖీ) పండుగ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్)కు సోదరి, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. ప్రగతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమ ఉన్నారు. అలాగే ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కూడా కవిత రాఖీ కట్టారు.
అలాగే టీఆర్‌ఎస్ మహిళా టీఆర్‌ఎస్ నేతలు కూడా కేటీఆర్‌కు రాఖీ కట్టారు. మంత్రి సత్యవతి రాథోడ్, లోక్‌సభ సభ్యురాలు మాలోతు కవిత, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత, జయశంకర్ భూపాలపల్లి జడ్పీచైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, టీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు గుండు సుధారాణి మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టారు.
Next Story