హిందూ దేవతల మీద సామాజిక మాధ్యమాల్లో వల్గర్ కామెంట్లు చేసే వాళ్లు అధికంగా ఉంటారు. హిందూ దేవతలను వివిధ రకాల ఎడిట్లు చేస్తూ.. వారి మీద లైంగికంగా కామెంట్లు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో మనోభావాలను దెబ్బతీస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఓ కామెంట్ పెట్టిన వ్యక్తికి కంగనా రనౌత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా గట్టిగా సమాధానం ఇచ్చింది.

Armin Navabi ట్విట్టర్ ఖాతాదారుడు కాళికా దేవిని అసభ్యంగా చూపిస్తూ వేసిన ఆర్ట్ ను ట్విట్టర్ లో పోస్టు చేసి.. ‘ఇంత సెక్సీగా ఉన్న హిందూ దేవతను ఎప్పుడూ చూడలేదు.. ఇకపై నేను కూడా హిందుత్వాన్ని ప్రేమిస్తాను’ అంటూ అసభ్యకరంగా పోస్టు పెట్టాడు.

దీనిపై కంగనా రనౌత్ స్పందించింది. ‘మహాకాళీని కూడా ఇలాంటి దృష్టిలో చూస్తున్న నీలాంటి వాళ్లు తల్లి చనుబాల విషయంలోనూ, బిడ్డకు జన్మనిచ్చే విధానాన్ని కూడా శృంగార కోణంలోనే ఆలోచిస్తారు’ అని చెప్పుకొచ్చింది. ఇకనైనా ఎదుగుతావో లేదో అంటూ అతడి నోరు మూయించింది.

మరోవైపు బాలీవుడ్ లో డ్రగ్స్ ను తీసుకునే హీరోలు అంటూ ఇంకో సంచలనానికి తెరతీసింది. బాలీవుడ్ లో స్టార్ హీరోలయిన రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌశల్‌లు డ్రగ్స్ కు బానిసలయ్యారు.. అనే ఆరోపణలు ఉన్నాయని వారు డ్రగ్ టెస్ట్ చేయించుకుని వారిని ఆరాధించే లక్షలాది అభిమానులకు ఆదర్శంగా నిలవాలని ట్విట్టర్ ద్వారా ఆమె కోరింది.

సుశాంత్ మరణానికి సినీ మాఫియానే కారణమని చెబుతున్న కంగనా సినీ మాఫియాకు సంబంధించి అసలు నేరస్తుడు కరణ్ జోహారేనని అంటూ మండిపడ్డారు. అనేకమంది జీవితాలను, కెరీర్లను నాశనం చేసిన తర్వాత కూడా అతడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడన్నారు కంగనా. అతడిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకునేది జరిగే పనేనా? . ఈ వ్యవహారం అంతా సద్దుమణిగాక కరణ్, క్రూరమృగాల వంటి అతని గ్యాంగ్ సభ్యుల తనను టార్గెట్ చేస్తారంటూ ట్వీట్‌ చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *