మిమ్మల్ని తెగ నవ్వించిన కమెడియనే.. కాకపోతే కొత్త లుక్‌లో..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Sep 2020 6:51 AM GMT
డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ సినీ హాస్యనటుడు సంతానం కొత్త గెటప్‌లో ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫొటోను చూసిన ఆయన అభిమానులు న్యూలుక్ పై లైక్లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముందుగా హాస్యనటుడిగా తమిళ ప్రేక్షకులను పరిచయమయిన సంతానం ప్రస్తుతం హీరో అయ్యారు.
సంతానం హీరోగా నటించిన కొన్ని చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మాంచి హిట్ అయ్యాయి. సంతానం హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వ్యాయామం ద్వారా దేహదారుఢ్యాన్ని పెంచుకున్నారు. ఆయన ప్రస్తుతం ‘బిస్కోత్’, ‘డిక్కిలోనా’ చిత్రాలలో హీరోగా నటించారు.
అయితే.. లాక్‌డౌన్ కారణంగా ‘బిస్కోత్’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేఫథ్యంలో సంతానం నిండైన గడ్డంతో నల్లటి కళ్ళద్దాలతో కొత్త గెటప్‌తో ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో రావడం.. వైరల్ అవడంతో.. సంతానం కొత్త సినిమా కోసమే ఈ లుక్ అని అభిమానులు అనుకుంటున్నారు.