వారిని పబ్లిక్ లో చంపేయాలి : క‌ంగ‌నా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2020 12:31 PM GMT
వారిని పబ్లిక్ లో చంపేయాలి : క‌ంగ‌నా

ఉత్తరప్రదేశ్‌లో నలుగురి కామాంధుల చేతిలో అత్యాచారానికి గురైన ఓ దళిత యువతి ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ యువతి మంగళవారం మృతి చెందింది. ఈనెల 14న ఆమెపై నలుగురు మృగాళ్లు అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హత్రస్‌ జిల్లాలో జరిగింది.

ఈ ఘటనపై పలువురు ప్రముఖులు స్పందించారు. ఆ రాక్షసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కంగనా రనౌత్ ఢిల్లీ ఆసుపత్రిలో కన్నుమూసిన సామూహిక అత్యాచార బాధితురాలుకి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ..అలాంటి వారిని ఊరికే వదలిపెట్టవద్దని కోరింది కంగనా.ఈ రేపిస్టులను బహిరంగంగా కాల్చండి.. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఈ సామూహిక అత్యాచారాలకు పరిష్కారం ఏమిటి? ఈ దేశానికి ఎంతో విచారకరమైన రోజు అంటూ కంగనా ట్వీట్ చేసింది.



Shoot these rapists publicly, what is the solution to these gang rapes that are growing in numbers every year? What a sad and shameful day for this country. Shame on us we failed our daughters #RIPManishaValmiki అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది కంగనా.

హత్రస్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఆ యువతి తన పొలంలో గడ్డి కోయడానికి వెళ్లింది. ఆ యువతితో ఆమె అమ్మ, సోదరి, సోదరుడు కూడా ఉన్నారు. అమ్మ, సోదరులకు దూరంగా ఆ యువతి పని చేస్తుండగా, వెనుక నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు ఆమెను పక్కనే ఉన్నచేనులోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆమె నాలుక కోసేశారు ఆ కామాంధులు.

యువతి ఆర్ధనాదాలు విన్న ఆమె కుటుంబ సభ్యులు గమనించి వెళ్లే సరికి దుండగులు పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను వెంటనే హత్రాస్‌లోని జిల్లా కేంద్రంలో ఉన్నప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించారు. అక్కడ చికిత్స పొందిన ఆమె ప్రాణాలు విడిచింది.

Next Story