రూ.25 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
By సుభాష్ Published on 29 Sep 2020 2:56 AM GMT
అస్సాంలో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. డ్రగ్ స్మగ్లింగ్‌ను రూపు మాపేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతుండగా, కబ్రి అంగ్లాంగ్ జిల్లాలో రూ.25 కోట్ల విలువ చేసే ఐదు కిలోల హెరాయిన్ పట్టుబడినట్లు డీజీపీ భాస్కర జ్యోతి మహంతా వెల్లడించారు. అస్సాంలో ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారని డీజీపీ తెలిపారు.
వీటిని సరఫరా చేస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, అస్సాం- నాగలాండ సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఈ అక్రమ రవాణా గుట్టురట్టయింది. పట్టుబడిన హెరాయిన్ మార్కెట్ విలువ ప్రకారం.. రూ.25 కోట్ల వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు.
Next Story