రూ.25 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
By సుభాష్ Published on 29 Sep 2020 2:56 AM GMTఅస్సాంలో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. డ్రగ్ స్మగ్లింగ్‌ను రూపు మాపేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతుండగా, కబ్రి అంగ్లాంగ్ జిల్లాలో రూ.25 కోట్ల విలువ చేసే ఐదు కిలోల హెరాయిన్ పట్టుబడినట్లు డీజీపీ భాస్కర జ్యోతి మహంతా వెల్లడించారు. అస్సాంలో ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారని డీజీపీ తెలిపారు.
వీటిని సరఫరా చేస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, అస్సాం- నాగలాండ సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఈ అక్రమ రవాణా గుట్టురట్టయింది. పట్టుబడిన హెరాయిన్ మార్కెట్ విలువ ప్రకారం.. రూ.25 కోట్ల వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు.
Next Story