యూపీలో దారుణం.. నాలుక కోసేసి యువతిపై అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి

By సుభాష్  Published on  29 Sep 2020 11:35 AM GMT
యూపీలో దారుణం.. నాలుక కోసేసి యువతిపై అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి

ఉత్తరప్రదేశ్‌లో నలుగురి కామాంధుల చేతిలో అత్యాచారానికి గురైన ఓ దళిత యువతి ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ యువతి మంగళవారం మృతి చెందింది. ఈనెల 14న ఆమెపై నలుగురు మృగాళ్లు అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హత్రస్‌ జిల్లాలో జరిగింది.

హత్రస్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఆ యువతి తన పొలంలో గడ్డి కోయడానికి వెళ్లింది. ఆ యువతితో ఆమె అమ్మ, సోదరి, సోదరుడు కూడా ఉన్నారు. అమ్మ, సోదరులకు దూరంగా ఆ యువతి పని చేస్తుండగా, వెనుక నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు ఆమెను పక్కనే ఉన్నచేనులోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆమె నాలుక కోసేశారు ఆ కామాంధులు. యువతి ఆర్ధనాదాలు విన్న ఆమె కుటుంబ సభ్యులు గమనించి వెళ్లే సరికి దుండగులు పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను వెంటనే హత్రాస్‌లోని జిల్లా కేంద్రంలో ఉన్నప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించారు. అక్కడ రెండు వారాలపాటు చికిత్స పొందిన ఆమె ఆ రోజు ప్రాణాలు విడిచింది. అదే రోజు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గాలించి అరెస్టు చేశారు.

Next Story
Share it