వైఎస్‌ జ‌యంతి‌.. ఇక‌పై ఏపీలో 'రైతు దినోత్సవం'.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Jun 2020 3:27 AM GMT
వైఎస్‌ జ‌యంతి‌.. ఇక‌పై ఏపీలో రైతు దినోత్సవం.!

దివంగ‌త నేత‌, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం‌ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవం గా ప్రకటిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ ముఖ్య‌మంత్రిగా రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారని స‌ర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమానికి ఆయ‌న తీసుకున్న చ‌ర్య‌లు విప్ల‌వాత్మ‌క‌మైన‌వ‌ని వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో ఆ దివంగ‌త నేత స్మారకంగా ప్రతి ఏడాది జూలై 8వ తేదీని ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించింది.

ఇదిలావుంటే.. వ‌రుస‌గా రెండు సార్లు ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించిన ఆయ‌న‌.. సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ.. నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడు. ఇక తెలుగు రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మొహమాట ధోరణికి ప్రసిద్ధుడుగా రాజశేఖరరెడ్డికి పేరుంది.

Next Story
Share it