ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా...
RBI Job Notification. నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). ఆర్బీ ఆఫీస్ అటెండెంట్ పోస్టు దరఖాస్తు చేసుకోండిలా.
By Medi Samrat Published on 3 March 2021 9:22 AM ISTఎలా దరఖాస్తు చేసుకోవాలి...?
అభ్యర్థులు ముందుగా https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
అందులో Current Vacancies ట్యాబ్ క్లిక్ చేసి Vacancies పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Recruitment for the post of Office Attendants – 2020 పైన క్లిక్ చేయాలి.
ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి. ఆ తర్వాత Online Application Form పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.అందులో NEW REGISTRATION పైన క్లిక్ చేయాలి.
పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసిన తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. తప్పులు ఏవైనా ఉంటే సరిచేయాలి.
ఆ తర్వాత save and next పైన క్లిక్ చేయాలి.
దరఖాస్తు ఫీజు చెల్లించిన Final Submit బటన్ పైన క్లిక్ చేయాలి.
మీ అప్లికేషన్ ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.
అప్లికేషన్ వివరాలు ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి.
దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.