చేనేత జౌళి శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరణ
Jobs in Handloom Textile Department. జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో టెస్ట్ టైల్ డిజైనర్ 7 ఖాళీలు
By Medi Samrat Published on 10 Jan 2023 11:58 AM GMT
జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో టెస్ట్ టైల్ డిజైనర్ 7 ఖాళీలు, క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ 7 ఖాళీలులో పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు చేనేత, జౌళి శాఖ కమిషనర్ ఎమ్ ఎమ్. నాయక్ ఒక ప్రకటనలో కోరారు. బనగాన పల్లె (నంద్యాల), మురమండ, పూలగుర్త (తూర్పు గోదావరి), పాలకొండ, నారాయణపురం (పార్వతీపురం మన్యం), బొబ్బిలి (విజయనగరం), పాయకరావుపేట (అనకాపల్లె) లలో నియామకాలు జరుగుతాయని తెలిపారు.
1. క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ నకు హ్యాండ్ లూమ్ టెక్నాలజీ లో డిప్లొమా కలిగి 2 సంవత్సరాలు అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి రికార్డుల నిర్వహణ వహించవలసి ఉంటుందన్నారు.
2. టెస్ట్ టైల్ డిజైనర్ పోస్ట్ కు టెస్ట్ టైల్ డిజైన్ ఇనిస్టిట్యూట్ నుండి ఉత్తీర్ణులై ఉండి, 2 సంవత్సరాల అనుభవం కలిగి చేనేత రంగంలో డిజైన్స్ ఉత్పత్తుల యొక్క ఉన్నతి, అభివృద్ధిలో అనుభవం కలిగి ఉండాలి. ఏదైనా కంపెనీ లేదా ఏజెన్సీ డిజైనర్ ను సిఫార్స్ చేస్తున్నట్లయితే టెస్ట్ టైల్ డిజైనర్ యొక్క బయో డేటా తో పాటు కంపెనీ/ఏజెన్సీ వివరాలు సమర్పించాలి.
నియామకాలు అర్హత, అనుభవం, వయస్సు, నివాసం ఆధారంగా జరుగును. దరఖాస్తుదారుడు ధ్రువపత్రాల కాపీలతో పాటు బయో డేటా ను సమర్పించాలి. క్లస్టర్ మార్గదర్శకాలు http://www.aphandtex.gov.in website నుండి పొందవచ్చును. నియామకాలు తాత్కాలిక ప్రాతిపదికన ఉండి 3 సంవత్సరాల వరకూ నెలకు 30 వేల రూపాయలు కన్సాలి డేటెడ్ పారితోషికం ఉంటుంది.
పై పోస్టులకు తమ సేవలను అందించడానికి ఆసక్తి ఉన్న అర్హత గల అభ్యర్థులు ఈనెల 31వ తేదీ లోగా కమిషనర్, చేనేత మరియు జౌళి శాఖ, 4వ అంతస్తు, IHC కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, పిన్ కోడ్ 522523 నకు దరఖాస్తులను సమర్పించవలెనని ప్రకటనలో కోరారు.