ఇండియన్ ఆర్మీలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి.!

దేశ సేవ చేయాలని భావించే యువ వైద్యులకు ఇండియన్ ఆర్మీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

By -  Medi Samrat
Published on : 22 Feb 2026 11:20 AM IST

ఇండియన్ ఆర్మీలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి.!

దేశ సేవ చేయాలని భావించే యువ వైద్యులకు ఇండియన్ ఆర్మీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (AFMS) కింద షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ద్వారా 100 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పురుషులకు 75, మహిళలకు 25 పోస్టులు కేటాయించారు.

అర్హతల వివరాలు చూస్తే ఎంబీబీఎస్ (MBBS) డిగ్రీ పూర్తి చేయడంతో పాటు, నీట్ పీజీ (NEET PG) పరీక్ష రాసి ఉండాలి. వయోపరిమితి 2026 డిసెంబర్ 31 నాటికి వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపులు ఉంటాయి. ఎంపిక విధానంలో మొదట అప్లికేషన్ల షార్ట్ లిస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ విధానంలో అన్ని కేటగిరీల వారు దరఖాస్తు ఫీజు కేవలం రూ. 200 చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 4వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం, దరఖాస్తు చేసుకోవడానికి 'join.afms.gov.in' అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Next Story