తెలంగాణలో విడుదలైన గ్రూప్‌-4 ఫలితాలు

తెలంగాణలో గ్రూప్‌-4 ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల లిస్టును కమిషన్‌ ప్రకటించింది.

By Medi Samrat  Published on  10 Feb 2024 1:59 AM GMT
తెలంగాణలో విడుదలైన గ్రూప్‌-4 ఫలితాలు

తెలంగాణలో గ్రూప్‌-4 ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల లిస్టును కమిషన్‌ ప్రకటించింది. https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో ర్యాంకులు చూసుకోవాలని అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ సూచించింది. ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. గతేడాది తెలంగాణలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కిందటి ఏడాది జులైలో గ్రూప్‌-4 పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. అందులో 7,62,872 మంది పేపర్-1 రాశారు. 7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు.

తెలంగాణలో ఈసెట్‌, లాసెట్‌ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఫిబ్రవరి 14న ఈసెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌సీహెచ్‌ఈ పేర్కొంది. 500 రూపాయల.. ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 22 వరకు, రూ.1000 చెల్లిస్తే ఏప్రిల్‌ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే1 నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, 6న ఈసెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 28న లాసెట్‌ నోటిఫికేషన్‌ వెలువడనుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్‌ 3న ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు నిర్వహించనున్నారు.

Next Story