కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ.. 7వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న 729 బోధనేతర (నాన్ టీచింగ్) సిబ్బంది పోస్టులను

By Medi Samrat  Published on  5 Oct 2024 6:13 AM IST
కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ.. 7వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న 729 బోధనేతర (నాన్ టీచింగ్) సిబ్బంది పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 2024-25 విద్యా సంవత్సరం (ఒక సంవత్సరం) కాలానికి భర్తీ చేయడానికి అర్హులైన, ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఈ నెల 7వ తేదీ నుండి ఈ నెల 15వ తదీ వరకు స్వీకరించనుంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను మండల విద్యాశాఖాధికారి కార్యాలయం లో ఆఫ్ లైన్ ద్వారా అందజేయాలని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది

ఖాళీల వివరాలిలా..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టైప్ 3 కేజీబీవీల్లో 547 పోస్టులకు గాను హెడ్ కుక్ 48, అసిస్టెంట్ కుక్ 263, డే & నైట్ వాచ్ ఉమెన్ 95, స్కావెంజర్ 79, స్వీపర్ 62 ఖాళీలు ఉన్నాయి. టైప్ 4 కేజీబీవీల్లో 182 పోస్టులకు గాను హెడ్ కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, చౌకీదార్ 58 పోస్టులు భర్తీ చేయనున్నారని తెలిపారు.

ఎంపిక ప్రక్రియ ఇలా:

1) జిల్లా స్థాయిలో మరియు మండల స్థాయిలో పేపర్ నోటిఫికేషన్ విడుదల 07-10-2024

2) మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఆఫ్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 07-10-2024

15-10-2024 వరకు

3) మండలాల వారీగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా తయారీ 16-10-2024

4) మండలాల నుండి 17-10-2024న సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ (APC) కార్యాలయానికి దరఖాస్తుల సమర్పణ

5) 18-10-2024న జిల్లా స్థాయిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తుది జాబితా తయారీ.

6) 21-10-2024న ఆమోదం కోసం జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ముందు ఉంచడం

7) APCOS ఛైర్మన్‌కి ఎంపిక జాబితాల సమర్పణ 22-10-2024

8) డ్యూటీకి రిపోర్టింగ్ 22-10-2024.

Next Story