వారి తీరుతో తలనొప్పి.. అర్థరాత్రి వేళ పోలీసులకు జయాబచ్చన్ ఫోన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 July 2020 6:06 AM GMT
వారి తీరుతో తలనొప్పి.. అర్థరాత్రి వేళ పోలీసులకు జయాబచ్చన్ ఫోన్

బాలీవుడ్ లో ప్రముఖ సినీ కుటుంబాల్లో బిగ్ బీ అమితాబ్ ఫ్యామిలీ ముందుంటుంది. వారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా బిగ్ బీ సతీమణి జయాబచ్చన్.. అర్థరాత్రి వేళలో జూహు పోలీసులకు ఫోన్ చేశారు. రాత్రి వేళ.. అంత అవసరం ఏమొచ్చిందన్న విషయంలోకి వెళితే.. తమ ఇంటి బయట రాత్రి వేళలో.. బాగా పొద్దుపోయిన తర్వాత బైకర్లు తెగ హడావుడి చేస్తున్నట్లు ఆమె ఆరోపిస్తున్నారు.

రాత్రి వేళలో అదే పనిగా డిస్ట్రబ్ చేసేలా బైకర్లు తమ ఇంటి బయట చక్కర్లు కొడుతున్నారని.. వారితో తాము ఇబ్బందికి గురి అవుతున్నట్లు చెప్పారు. జయాబచ్చన్ నుంచి ఫోన్ వచ్చినంతనే.. పోలీసులు కొందరు వారింటికి వెళ్లారు. అయితే.. తాము అక్కడికి వెళ్లే సరికి ఎవరూ లేరని పోలీసు అధికారులు చెబుతున్నారు. కరోనా కారణంగా రోడ్లు ఖాళీగా ఉండటంతో బైకర్లు యమా స్పీడ్ గా దూసుకెళుతున్నారని భావిస్తున్నారు.

ఎంత రోడ్లు ఖాళీగా ఉంటే మాత్రం.. వేగంగా వెళ్లే బైకర్లు ఎవరు? ఇంటి చుట్టూ అదే పనిగా చక్కర్లు కొట్టే బైకర్లు ఎవరో బచ్చన్ ఫ్యామిలీకి తెలీకుండా ఉంటుందా? కొందరు ఆకతాయిలు కావాలనే తమను ఇబ్బంది పెట్టేందుకు ఇంటి చుట్టు తిరుగుతున్నట్లు బిగ్ బి ఫ్యామిలీ చెబుతోంది. దీంతో పోలీసులు.. ఈ విషయాన్ని తేల్చేందుకు మరోసారి రంగంలోకి దిగారు. తాజాగా.. సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తిస్తామని చెబుతున్నారు. అంత రాత్రి వేళ.. బిగ్ బి ఫ్యామిలీ పోలీసులకు ఫోన్ చేయటమంటే.. ఇబ్బంది లేకుండా ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును పోలీసులు ఏలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

Next Story
Share it