కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు.. హెచ్చరించింది ఎవరో తెలుసా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 July 2020 5:32 AM GMT
కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు.. హెచ్చరించింది ఎవరో తెలుసా..?

కేరళ, కర్ణాటకలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ‘అల్‌ఖైదా ఇన్‌ ద ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌' (ఏక్యూఐఎస్‌) ఉగ్ర వాద సంస్థ భారత్ లో దాడులకు కుట్రపన్నుతున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని నిమ్రుజ్‌, హెల్మండ్‌, కాందహార్‌ రాష్ట్రాలలో తాలిబన్లు ఏక్యూఐఎస్ సంస్థకు మద్దతుగా ఉన్నారు. కార్యకలాపాలు సాగిస్తున్నదని వెల్లడించింది. కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన వాళ్ళే కాకుండా.. బంగ్లాదేశ్‌, మయన్మార్‌, పాకిస్థాన్‌కు చెందిన 150-200 మంది సభ్యులుగా ఉన్నారు.

ఏక్యూఐఎస్ సంస్థ పలు దాడులకు పాల్పడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒసామా మసూద్ ఈ సంస్థకు‌ ప్రస్తుతం అధిపతిగా ఉన్నాడు. ఏక్యూఐఎస్ మాజీ అధిపతి ఆసిం ఉమర్‌ మృతికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ సంస్థ ప్రణాళికలు రచిస్తోందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఐఎస్‌ఐఎస్‌, అల్‌ఖైదా, వాటి అనుబంధ సంస్థలు, వ్యక్తులపై ఆంక్షల అమలు పర్యవేక్షణ కమిటీ తాజాగా తన నివేదికను విడుదల చేసింది. ఐఎస్‌కు చెందిన భారత శాఖలో దాదాపు 180 నుంచి 200 మంది సభ్యులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. జులై 23న ఈ నివేదికను వెల్లడించింది. కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో పెద్ద ఎత్తున తీవ్రవాదులు దాగి ఉన్నట్లు తెలుస్తోంది.

తీవ్రవాదులు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లలేకపోతున్నారని కూడా యునైటెడ్ నేషన్స్ తెలిపింది. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం వల్ల ఉగ్రవాద నెట్‌వర్కింగ్, ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు గణనీయంగా తగ్గినట్టు వివరించింది. కోవిడ్ ఆంక్షల వల్ల ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న లక్ష్యాల సంఖ్య తగ్గిందని పేర్కొంది. బహిరంగ సభలపై నిషేధం, వేదికలు మూసివేయడంతో దాడులకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదని తెలుస్తోంది. తీవ్రవాదులకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ప్రస్తుతం తలెత్తాయని తాజా రిపోర్టులో వెల్లడైంది.

Next Story
Share it