కరోనా వైరస్‌ ఎవ్వరిని వదలడం లేదు. చివరకు జైల్లో ఉన్న ఖైదీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. జైల్లో ఉన్నఖైదీలకు కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని బైటా ఆస్పత్రిలో చికిత్సకు తరలిస్తున్న క్రమంలో వారు అక్కడి నుంచి తప్పించుకుపోతున్నారు. దీంతో అసోంలోని గుహవాటి జైలును కరోనా చికిత్సా కేంద్రంగా మార్చేశారు.

ఇదిలా ఉండగా, అసోం జైల్లో కరోనా సోకుతున్న ఖైదీల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇలా రాష్ట్రంలోని పది జైళ్లలో మొత్తం 535 ఖైదీలు కరోనా బారిన పడ్డారని రాష్ట్ర జైళ్ల శాఖ ఇన్స్‌ పెక్టర్‌ జనరల్‌ దశరథ్‌ దాస్‌ తెలిపారు.

ఒక్క గుహవాటి జైలోలోనే 435 మంది ఖైదీలకు కరోనా సోకిట్లు నిర్ధారణ అయ్యింది. దాదాపు 200 బెడ్లతో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మారిన గుహవాటి జైలులో కరోనా సోకిన వారంతా చికిత్స  పొందుతున్నారు. ఈ జైలులో ఉన్న ఖైదీల్లో 44 శాతం మందికి కరోనా సోకడం తీవ్ర సంచలనంగా మారింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.