దేశంలో 32వేలు దాటిన కరోనా మరణాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 July 2020 4:56 AM GMT
దేశంలో 32వేలు దాటిన కరోనా మరణాలు

భారత్‌లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొద్ది రోజులుగా రికార్డు సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 48,661 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 705 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,85,885కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 32వేల మంది మృత్యువాత పడ్డారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 8,85,577 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 4,67,882 మంది ఆస్నత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 63శాతంగా ఉంది.

దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. నిన్న దేశంలో 4,42,263 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 1,62,91,331కి చేరింది. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అక్కడి తీవ్రతను బట్టి లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడవ స్థానంలో ఉండగా.. అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో ఆరవ స్థానంలో కొనసాగుతోంది.

Next Story