దొరబాబు చేసిన పనికి 'హైపర్‌ ఆది'కి దెబ్బేనా..?

By సుభాష్  Published on  14 March 2020 1:23 PM IST
దొరబాబు చేసిన పనికి హైపర్‌ ఆదికి దెబ్బేనా..?

ఇటీవల జబర్దస్త్‌ కమెడియన్‌ దొరబాబు, పరదేశీలు విశాఖలో సెక్స్‌ రాకెట్‌ విషయంలో అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. జబర్దస్త్‌ లో ఎంతో క్రేజ్‌ ఉన్న దొరబాబుకు ఒక్కసారిగా ఇమేజ్‌ తగ్గిపోయింది. అప్పటి నుంచి దొరబాబు గురించే చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం దొరబాబు వ్యవహారం హైపర్‌ ఆది టీమ్‌ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తెలుస్తోంది. కొత్త ఎపిసోడ్‌లలో దొరబాబు లేకుండా ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఆదికి పెద్ద దెబ్బేనని చెప్పాలి. ఆది స్కిట్‌లో కంటెంట్‌ తక్కువగా హడావిడి ఎక్కువ అన్నట్లే కనిపిస్తుంది. కాగా, ఆది స్కిట్స్‌ ను ఎక్కువగా బతికించేది రైజింగ్‌ రాజు, దొరబాబుపైన వేసే పంచుడైలాగులే.

ఈ వ్యవహారంలో నిజంగానే వీళ్లు అలాంటి వాళ్లేనని ముద్రపడిపోయింది. జనాలు సైతం ఛీకొడుతున్నారు. కాగా, వీళ్లున్న టీమ్‌ లీడర్‌ హైపర్‌ ఆది కూడా ఈ ఇద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అందరిలో తలెత్తుతున్న ప్రశ్న. దొరబాబుతోపాటు పరదేశీది కూడా అదే పరిస్థితి. పరదేశీ ఆది రాసే స్కిట్‌ లలో రైటర్‌గా కూడా పని చేస్తున్నాడట. ఆయన తండ్రి లేడు. సినిమాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈ మార్గాన్ని ఎంచుకుంటే అడ్డంగా దొరికి లైఫ్‌ అంతా నాశనం చేసుకున్నాడు.

ఇదిలాఉంటే దొరబాబు కూడా అంతకు ముందు బి గ్రేడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ చేశాడు. హైపర్‌ ఆది కూడా గతంలో దొరబాబు నటించిన పలు షార్ట్‌ ఫిలిమ్స్‌ లను ఆధారంగా చేసుకుని తన స్కిట్‌లో కామెడీ పండించడం చేసేవాడని తెలుస్తోంది. వీరిద్దరూ చేసిన ఘనకార్యానికి మల్లెమాల ప్రొడక్షన్స్‌ సీరియర్‌గానే స్పందించినట్లు తెలుస్తోంది.

కాగా, జబర్దస్త్ లో జరుగుతున్న పరిణామాలతో హైపర్‌ ఆది జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే హైపర్‌ ఆది కూడా జబర్దస్త్‌ నుంచి దూరం అయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కరలేదని టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం హైపర్‌ ఆది సినిమాలు, ఢీ షోలతో కాస్త బిజీ బిజీగా ఉన్నాడు. ఈవెంట్స్‌ కూడా బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆది జబర్దస్త్‌ కు దూరంగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నట్లు బుల్లితెర సన్నిహితుల ద్వారా సమాచారం. అంతేకాదు హైపర్‌ ఆది మరో యాంకర్‌తో కొత్త షోను నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

Next Story