జబర్దస్త్ కమెడియన్ దొరబాబు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ఇప్పుడు బుల్లితెర వర్గాల్లో దొరబాబు వ్యవహారం హట్‌టాపిగ్గా మారింది. గత వారంరోజులుగా సోషల్‌ మీడియాలో దొరబాబు పేరు మారుమోగిపోతోంది. జబర్దస్త్‌ షోలో కమెడియన్‌గా తనకంటు గుర్తింపు తెచ్చుకున్న దొరబాబు వ్యవహారం ‘బతుకుజట్కాబండి’కి చేరుతున్నట్లు తెలుస్తోంది. దొరబాబు వ్యభిచారం చేస్తూ విశాఖలో పోలీసులకు అడ్డంగా దొరికపోయిన విషయం తెలిసిందే. కానీ ఆ రోజు రాత్రి ఏం జరిగిందనేదానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.

ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారు. వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడని కొందరు చెబుతుంటే.. హైదరాబాద్‌ నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం గృహం నడిపిస్తున్నారని మరి కొందరు చెబుతున్నారు. ఇందులో ఏది కూడా పూర్తిగా క్లారిటీ లేదు. కానీ దొరబాబు భార్య మాత్రం అతనికి అండగా నిలిచింది. తన భర్త అలాంటి వ్యక్తి కాదని వెనుకేసుకొస్తుంది.

ఈ సందర్భంగా రోజా నిర్వహించే బతుకుజట్కాబండి వేదికను ఎక్కాలని ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఈ షో వేదికగా తనతోపాటు భర్త దొరబాబును ప్రేక్షకుల ముందుకొచ్చి పబ్లిక్‌గా పూర్తి క్లారిటీ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

నటి, ఎమ్మెల్యే రోజా ఒక వైపు జబర్దస్త్‌ షో నిర్వహిస్తూనే మరో వైపు రచ్చబండ, బతుకు జట్కాబండి వంటి కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఎవరి కుటుంబంలోనైనా కుటుంబ కలహాలు ఉంటే సరైన తీర్పు ఇస్తూ వారి కాపురాలను సరిదిద్దుతూ ఉన్నారు. ఇప్పుడు అదే తరహాలో దొరబాబును ఆయన భార్య ఈ కార్యక్రమానికి పిలిపించి ఆ రోజు ఏం జరిగిందనే దానిపై ప్రేక్షకులకు క్లారిటీ ఇవ్వాలని అనుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి దొరబాబు వ్యవహారంలో అండగా నిలుస్తుందనే చెప్పాలి. అందుకే గురువారం జరిగిన జబర్దస్త్‌ షోలో దొరబాబు కనిపించడమే ఇందుకు నిదర్శనమని తెలుస్తోంది. మరి దొరబాబు వ్యవహారంపై బతుకు జట్కాబండి వేదికగా ఎలాంటి క్లారిటీ ఇవ్వనున్నారో వేచి చూడాలి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.