జబర్దస్త్‌ షో ద్వారా కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దొరబాబు. కాని ఒక్క పనిలో పరువంతా పోయింది. రెండు రోజుల కిందట విశాఖలో ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేది ఎవరికి క్లారిటీ లేదు. దొరబాబు, పరదేశీ కలిసి అక్కడ వ్యభిచార గృహం నడిపిస్తున్నారని కొందరు చెబుతున్నమాట. హైదరాబాద్‌ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి అక్కడ వ్యభిచారం చేయిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కొన్ని నిజాలు మాత్రం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి.

అసలు ఆ రోజు పోలీసులు అరెస్ట్‌ చేయడానికి వచ్చింది దొరబాబును కాదని సమాచారం. అసలు అక్కడ ఆయన ఉన్నట్లు కూడా ఎవరికి పెద్దగా సమాచారం లేదట. ఏదో పని నిమిత్తం విశాఖకు వచ్చిన దొరబాబు, పరదేశీని అక్కడ ఉన్న ఓ ఫ్రెండ్‌ ఆ చోటికి తీసుకెళ్లాడనే వార్తలు కూడా వినవస్తున్నాయి. అయితే వ్యభిచారం జరుగుతున్న పక్కప్లాట్‌లోకి కొందరు పేకాట ఆడుతున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రైడింగ్‌ చేసేందుకు వచ్చారని, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడున్న ఓ వ్యక్తి లోపల జబర్దస్త్‌ కమెడియన్‌ ఉన్నాడని పోలీసులకు చెప్పడంతో అనుమానం వచ్చి అసలు ఏం జరుగుతుందని పేకాట రాయుళ్లతో పాటు పక్కనే ఉన్న ఈ ప్లాట్‌లోకి కూడా పోలీసులు వెళ్లారని తెలుస్తోంది.

కానీ ఎవ్వరు ఊహించని విధంగా అక్కడ వ్యభిచారం జరుగుతుండటంతో సీన్‌ అంతా రివర్స్‌ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే అసలు అక్కడ దొరబాబు, పరదేశీ ఉన్నారని పోలీసులకు కూడా తెలియదని అక్కడున్నవాళ్లు కొందరు చెబుతున్నమాట. పేకాట ఆడుతున్న వాళ్ల కోసం వచ్చిన పోలీసులకు జబర్దస్త్‌ కమెడియన్లు కూడా అడ్డంగా దొరికిపోయారు. అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి అన్నట్లు జరిగింది. నిజానికి దొరబాబు అక్కడున్నట్లు కూడా ఎవ్వరికి తెలియదట. కానీ ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతోనే దొరబాబు పట్టుబడేలా చేసింది. కాగా, ఇందులో తమవాళ్లు ఏం తప్పు చేయలేదని దొరబాబు, పరదేశీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.