స్వలింగ సంపర్కుడిగా బహిరంగంగా ప్రకటించుకున్న మొదటి ఇమామ్ ముహ్సిన్ హెండ్రిక్స్ ను కాల్చి చంపారు. దక్షిణాఫ్రికాలోని గ్కేబెర్హాలో శనివారం అతడిని కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. ఇమామ్ మరో వ్యక్తితో కలిసి కారులో ఉండగా అడ్డుగా వాహనం పెట్టి వారి కారుపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. "ముఖాలు కప్పుకున్న ఇద్దరు గుర్తుతెలియని అనుమానితులు వాహనం నుండి దిగి వాహనంపై కాల్పులు జరపడం ప్రారంభించారు" అని తూర్పు కేప్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
స్వలింగ సంపర్కులు, ఇతర అట్టడుగున ఉన్న ముస్లింలకు సురక్షితమైన స్వర్గధామంగా ఉద్దేశించిన మసీదును హెండ్రిక్స్ నడిపినట్లు ది గార్డియన్ నివేదించింది. వాహనంలో వెనుక కూర్చున్న హెండ్రిక్స్ ను కాల్చి చంపారని, ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. ఇంటర్నేషనల్ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్, ఇంటర్‌సెక్స్ అసోసియేషన్ ఈ హత్యను ఖండించింది. ముహ్సిన్ హెండ్రిక్స్ హత్య వార్తతో ILGA వరల్డ్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జూలియా ఎహ్ర్ట్ ఒక ప్రకటనలో తెలిపారు.