షాకింగ్‌.. ఆ సూట్ కేసులో 'పుతిన్' మలమూత్రాలు..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా పర్యటన సందర్భంగా అలస్కాను సందర్శించారు.

By Medi Samrat
Published on : 18 Aug 2025 3:46 PM IST

షాకింగ్‌.. ఆ సూట్ కేసులో పుతిన్ మలమూత్రాలు..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా పర్యటన సందర్భంగా అలస్కాను సందర్శించారు. ఈ సందర్భంగా పుతిన్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు. అలాస్కాలో ట్రంప్‌, పుతిన్‌ల మధ్య జరిగిన 3 గంటల సుదీర్ఘ భేటీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇదిలా ఉంటే పుతిన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తోంది.

కొన్ని నివేదికల ప్రకారం.. అలాస్కాను సందర్శించిన పుతిన్ తనతో పాటు 'పూప్ సూట్‌కేస్' కూడా తీసుకువెళ్లాడు. ఈ సూట్‌కేస్ ఆయ‌న‌ అంగరక్షకుల చేతిలో ఉంది.. అందులో పుతిన్ మలం సేకరిస్తున్నారు. ఈ వార్త వింతగా అనిపించినా దీని వెనుక పెద్ద కారణం ఉంది. నిజానికి, పుతిన్ అనారోగ్యంతో ఉన్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో.. పుతిన్ తన అనారోగ్యం గురించి ఎవరికీ తెలియకూడదనుకుంటున్నారు. దీంతో పుతిన్ తన మలాన్ని అమెరికాలో వదిలివేయడం సరైనదని కాద‌ని భావించార‌ని నివేదిక‌లు చెబుతున్నాయి.

2007 తర్వాత రష్యా అధ్యక్షుడు అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా నిఘా సంస్థలు పుతిన్ భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. పుతిన్‌ను అన్ని వైపుల నుండి అంగరక్షకులు చుట్టుముట్టారు. అంగరక్షకులలో ఒకరి చేతిలో ఒక పూప్ సూట్‌కేస్ కూడా కనిపించింది.

పారిస్ మ్యాచ్, యుఎస్ ఎక్స్‌ప్రెస్ నివేదికల ప్రకారం.. పుతిన్ వ్యర్థాలను సేకరించే పని రష్యాకు చెందిన ఫెడరల్ ప్రొటెక్షన్ సర్వీస్ (FPS) బృందం చేస్తుంది. పుతిన్ అంగరక్షకులు ప్రత్యేక రకమైన బ్యాగ్‌ను కలిగి ఉన్నారు. అందులో వారు రష్యా అధ్యక్షుడి వ్యర్థాలను సేకరించి తమతో రష్యాకు తీసుకువెళతారు.

పుతిన్‌కు సంబంధించి ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా 2017లో పుతిన్ ఫ్రాన్స్ పర్యటనలో ఇటువంటి నివేదికలు వెలువ‌డ్డాయి. అదే సమయంలో.. పుతిన్ వియన్నా పర్యటనలో పోర్టబుల్ టాయిలెట్‌ను కూడా ఉపయోగించారు.

రష్యా అధ్యక్షుడయ్యాక 1999లో పుతిన్ ఈ కసరత్తు ప్రారంభించాడు.. అయితే పుతిన్ ఇలా ఎందుకు చేస్తాడు అనేది ప్రశ్న. నిజానికి పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.

అయితే.. రష్యాలోని రాష్ట్రపతి భవన్ ఈ వాదనలను పూర్తిగా తోసిపుచ్చింది. కానీ, ఎక్స్‌ప్రెస్ యుఎస్ నివేదిక ప్రకారం.. పుతిన్ పార్కిన్సన్స్ వంటి తీవ్రమైన నరాల వ్యాధితో బాధపడుతున్నారు. పుతిన్ అనారోగ్యం గురించి ఎవరూ తెలుసుకునేలా పుతిన్ ఏ దేశంలోనూ తన మలాన్ని వదలరు అని నివేదిక‌లు చెబుతున్నాయి.

Next Story