పాకిస్థాన్ వైఖరి మారినట్లుందే..!

We want friendly relations with all countries, including India. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ వైఖరిలో చాలా మార్పు వస్తోంది. ముఖ్యంగా భారత్

By Medi Samrat  Published on  23 March 2021 1:49 PM GMT
పాకిస్థాన్ వైఖరి మారినట్లుందే..!

ఇటీవలి కాలంలో పాకిస్థాన్ వైఖరిలో చాలా మార్పు వస్తోంది. ముఖ్యంగా భారత్ తో సత్సంబంధాల కోసం చేతులు చాస్తోంది. రెండేళ్ల తర్వాత భారత్ తో పాకిస్థాన్ భేటీ జరిగింది. మంగళవారం, బుధవారం రెండు దేశాల అధికారులు సమావేశం అవ్వనున్నారు. ఇరు దేశాల ప్రతినిధులు తమ అభ్యంతరాలు, సమస్యలపై చర్చల కోసం పాక్ ప్రతినిధుల బృందం భారత్ కు వచ్చింది. లడఖ్ లో సింధూ నదిపై భారత్ పలు జల విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేసింది. వాటిపై పాక్ ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. సింధూ నదీ నీటి పంపకాలపై శాశ్వత సింధు కమిషన్ 116వ సమావేశం జరుగుతుందని ఇటీవల పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి జహీద్ హఫీజ్ ఛౌదరి ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ కడుతున్న పాకాల్ దూల్, లోయర్ కల్నాయి జలవిద్యుత్ ప్రాజెక్టుల డిజైన్లు పాక్ కు నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది కూడానూ..!

భారత్ తో పాక్ సత్సంబంధాలను కోరుకుంటున్నట్టు ఆ దేశ దౌత్య ప్రతినిధి అఫ్తాబ్ హనస్ ఖాన్ తెలిపారు. ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన వివాదం చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం కావాలని అన్నారు. పొరుగుదేశాలతో పాక్ కోరుకుంటున్న సత్సంబంధాలు శాంతి నెలకొనడం వల్లనే సాధ్యమని అన్నారు. 70 ఏళ్లుగా నలుగుతున్న జమ్మూకశ్మీర్ ‌సమస్య చర్చల ద్వారా తప్పనిసరిగా పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్నారు. పాక్-ఇండియా మధ్య సంబంధాలు 2019లో పుల్వామా ఉగ్ర దాడి, అనంతరం భారత్ జరిపిన బాలాకోట్ వాయిదాడులతో మరింత దిగజారిన సంగతి తెలిసిందే. 2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను కేంద్రం రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. భారత్ మీద తీవ్రవాదులను ఉసిగొల్పుతూ ఉన్న పాకిస్థాన్.. ఈ మధ్య కాలంలో భారత్ తో మైత్రి కావాలని కోరుకుంటూ ఉంది.


Next Story