ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. అమెరికాలో ఈ 12 దేశాల పౌరుల ప్రవేశం పూర్తిగా నిషేధం..!

అమెరికాలోకి 12 దేశాల పౌరుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు.

By Medi Samrat
Published on : 5 Jun 2025 8:17 AM IST

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. అమెరికాలో ఈ 12 దేశాల పౌరుల ప్రవేశం పూర్తిగా నిషేధం..!

అమెరికాలోకి 12 దేశాల పౌరుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు మరో ఏడు దేశాల నుంచి అమెరికా వచ్చే వారిపై పాక్షిక ఆంక్షలు విధించారు. ఈమేర‌కు ట్రంప్ కొత్త ప్రకటనపై సంతకం చేశారు. దేశ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

నివేదిక ప్రకారం.. అమెరికాకు రాకుండా పూర్తిగా నిషేధించబడిన 12 దేశాలు ఇవే..

ఆఫ్ఘనిస్తాన్

మయన్మార్

చాడ్

కాంగో

ఈక్వటోరియల్ గినియా

ఎరిట్రియా

హైతీ

ఇరాన్

లిబియా

సోమాలియా

సూడాన్

యెమెన్

ఇది కాకుండా బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్‌మెనిస్తాన్, వెనిజులాతో సహా ఏడు ఇతర దేశాల నుండి వచ్చే వ్యక్తులపై డొనాల్డ్ ట్రంప్ పాక్షిక నిషేధం విధించారు. ఈ దేశాల నుండి వచ్చే వ్యక్తులపై ప్రత్యేక షరతులు, కఠినమైన తనిఖీలు విధించబడతాయి.

Next Story