హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిశాక కూడా 200 మందితో గ‌డ‌పింది..!

తనకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందని తెలిసినా కూడా ఆ మహిళ పలువురితో గడిపింది. దీంతో అధికారులు ఆమెతో గడిపిన వ్యక్తులందరూ వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు

By Medi Samrat  Published on  21 May 2024 8:32 AM IST
హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిశాక కూడా 200 మందితో గ‌డ‌పింది..!

తనకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందని తెలిసినా కూడా ఆ మహిళ పలువురితో గడిపింది. దీంతో అధికారులు ఆమెతో గడిపిన వ్యక్తులందరూ వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఒహియోలోని 30 ఏళ్ల సెక్స్ వర్కర్ తనకు హెచ్‌ఐవి-పాజిటివ్ అని తెలిసినప్పటికీ 200 మందికి పైగా క్లయింట్‌లతో గడిపింది. ఆమెతో గడిపిన వారు పరీక్షలు చేసుకోవాలని అధికారులు కోరారు. లిండా లెక్సెస్ జనవరి 1, 2022 నుండి గత రెండేళ్లలో అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 211 మంది క్లయింట్‌లతో లైంగిక సంబంధం కలిగి ఉంది. ఆమె తన హెచ్‌ఐవి పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని అధికారులు తెలిపారు. వెస్ట్ వర్జీనియా సరిహద్దుకు సమీపంలోని ఆగ్నేయ ఒహియోలోని ఒక చిన్న నగరమైన మారియెట్టాలో లిండా ఎక్కువ మందిని కలుసుకుని.. వారితో గడిపిందని అనుమానిస్తూ ఉన్నారు.

ఆమెతో గడిపిన వారిని అప్రమత్తం చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. మెరియెట్టా, బెల్ప్రే హెల్త్ డిపార్ట్‌మెంట్ లిండాతో పరిచయం ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. మే 13న అధికారులు లిండాను అరెస్టు చేశారు. ఆమెకు రెండేళ్లుగా హెచ్‌ఐవి-పాజిటివ్‌గా ఉందని, ఆమెకు తనకు ఈ విషయం ముందే తెలుసునని పోలీసులకు వివరించింది.

Next Story