రిపబ్లికన్‌ పార్టీకి నిర్ణయాత్మక ఆధిక్యం.. ఎలాన్ మస్క్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది.

By Medi Samrat  Published on  6 Nov 2024 2:26 PM IST
రిపబ్లికన్‌ పార్టీకి నిర్ణయాత్మక ఆధిక్యం.. ఎలాన్ మస్క్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. డెమొక్రాట్ పార్టీపై ఆయన పార్టీ నిర్ణయాత్మక ఆధిక్యం సాధించింది. కౌంటింగ్‌లో ఆధిక్యం పొందిన తర్వాత.. డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అమెరికన్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌ను ప్రశంసించారు. తన ప్రసంగంలో ఎలోన్ మస్క్‌ను స్టార్ అని పిలిచారు. ఎలోన్ మస్క్ మొదటి నుంచి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నారు. ట్రంప్ ఎలాన్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌ను కూడా ప్రశంసించారు. ఎలాన్‌ను మేధావి అని పేర్కొన్నారు. ఆ సమయంలో ఎలోన్ మస్క్ అక్కడ లేరు. కానీ, మస్క్ చాలా కాలంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు.

ఎలోన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ పోస్ట్‌లో ఆయ‌న‌ వైట్ హౌస్‌లో సింక్‌తో కనిపించాడు. ఈ పోస్ట్‌ను షేర్ చేస్తు.. లెట్ దట్ సింక్ ఇన్ అని రాశారు. అంటే ఇది ఒక ఇడియమ్.. అంటే ఒక ప్రకటనను అర్థం చేసుకోవడం లేదా పరిగణించడం వంటిది. ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత కూడా ఆయన ఇదే తరహా ట్వీట్‌ చేశారు.

ట్రంప్ పార్టీకి నిర్ణయాత్మక ఆధిక్యం లభించడంతో ఎలోన్ మస్క్ చాలా సంతోషంగా ఉన్నారు. తన సంస్థ స్పేస్‌ఎక్స్ రాకెట్ ప్రయోగానికి సంబంధించిన ఫోటోను పంచుకుంటూ.. భవిష్యత్తు చాలా ఉత్తేజకరంగా ఉండబోతోందని రాశారు.

అమెరికాలో ఎన్నికల సందర్భంగా ఎలాన్ మస్క్ బహిరంగంగా ట్రంప్‌కు మద్దతు పలికారు. ఆయనకు మంత్రి పదవి కూడా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఎలోన్ మస్క్ స్వయంగా ట్రంప్ సలహాదారుని కావాలనే కోరికను బహిరంగంగా వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు చెందిన వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కొత్త అమెరికా ప్రభుత్వంలో మంత్రిగా చేరవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా పోస్ట్‌లు వైరల్ అయ్యాయి.

Next Story