'అమెరికాకు భారత్ కంటే ముఖ్యమైన దేశం మరొకటి లేదు'

భారత్‌లో అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ తన పదవిని అధికారికంగా స్వీకరించారు. పదవిని చేపట్టిన తర్వాత సెర్గియో గోర్ మాట్లాడుతూ..

By -  Medi Samrat
Published on : 12 Jan 2026 3:40 PM IST

అమెరికాకు భారత్ కంటే ముఖ్యమైన దేశం మరొకటి లేదు

భారత్‌లో అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ తన పదవిని అధికారికంగా స్వీకరించారు. పదవిని చేపట్టిన తర్వాత సెర్గియో గోర్ మాట్లాడుతూ.. భారత్‌-యుఎస్ వాణిజ్య ఒప్పందం, ప్రధాని మోదీ-అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాలతో సహా అనేక ముఖ్యమైన అంశాలపై ప్రకటనలు ఇచ్చారు. భారత్‌లో అమెరికా రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సెర్గియో గోర్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి ప్రపంచమంతా పర్యటించానని, ప్రధాని మోదీతో ఆయ‌న‌కున్న‌ స్నేహం నిజమేనని నిర్ధారించుకోగలను. అమెరికా-భారతదేశాలు ఉమ్మడి ప్రయోజనాలతో మాత్రమే కాకుండా.. అత్యున్నత స్థాయిలో నిర్మించబడిన స్నేహం ద్వారా కూడా అనుసంధానించబడి ఉన్నాయని చెప్పారు. నిజమైన స్నేహితుల మ‌ధ్య‌ విభేదాలుంటాయి. కానీ వారు తమ విభేదాలను చివరికి పరిష్కరిస్తారన్నారు.

ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి సెర్గియో గోర్ మాట్లాడుతూ.. అమెరికాకు భారత్ అంత ముఖ్యమైన దేశం మరొకటి లేదని అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. కాబట్టి దేనినైనా ఖరారు చేయడం అంత తేలికైన పని కాదన్నారు. వచ్చే ఏడాదిలోగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటించవచ్చని గోర్‌ తెలిపారు. నేను నిన్ననే అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడాను. భారతదేశ ప్రజలందరికీ, ముఖ్యంగా ఆయ‌న‌ ప్రియమైన మిత్రుడు, మన అద్భుతమైన ప్రధాని మోదీకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీలో చాలా మంది విని ఉండవచ్చు.. అధ్యక్షుడు వైట్‌హౌస్‌లో బాల్‌రూమ్‌ను నిర్మించే పనిని ప్రారంభించారు.. ఆయ‌న ప్ర‌స్తుతం చాలా బిజీగా ఉన్నారు. నేను రాష్ట్రపతితో మాట్లాడినప్పుడు.. నేను అందమైన ఇండియా గేట్‌ను దాటినట్లు చెప్పానని సంభాష‌ణ‌ను వివ‌రించారు.

Next Story