డ్యాన్స్ క్లాస్‌లో ముగ్గురు బాలికలను చంపిన టీనేజర్.. నిందితుడికి 52 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
గత సంవత్సరం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సౌత్‌పోర్ట్‌లో ఒక వ్యక్తి ముగ్గురు బాలికలను కత్తితో పొడిచి చంపాడు.
By Medi Samrat Published on 24 Jan 2025 4:59 PM ISTగత సంవత్సరం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సౌత్‌పోర్ట్‌లో ఒక వ్యక్తి ముగ్గురు బాలికలను కత్తితో పొడిచి చంపాడు. ఇప్పుడు ఈ కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. సౌత్‌పోర్ట్‌లోని టేలర్ స్విఫ్ట్ నేపథ్య డ్యాన్స్ క్లాస్‌లో బాలికలు ఉన్న సమయంలో ఈ హత్యలు జరిగాయి. 18 ఏళ్ల ఆక్సెల్ రుడాకుబానాకు గురువారం శిక్ష విధించినట్లు అల్ జజీరా నివేదికను ఉటంకిస్తూ వార్తా సంస్థ ANI పేర్కొంది. నిందితుడు అమాయకమైన పిల్లలను సామూహికంగా హత్య చేశాడని న్యాయమూర్తి చెప్పారు.
గత ఏడాది జూలైలో నార్త్-వెస్ట్ ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో స్విఫ్ట్ నేపథ్య నృత్య తరగతిలో ముగ్గురు పాఠశాల విద్యార్థినులను హత్య చేసినట్లు నేరాన్ని ఆక్సెల్ రుడకుబానా అంగీకరించాడు. రుడకుబానాకు 52 ఏళ్ల జైలు శిక్ష విధించాలని తీర్పు సందర్భంగా కోర్టు పేర్కొంది.
17 ఏళ్ల రుడాకుబానా గత జూలైలో సౌత్‌పోర్ట్‌లోని డ్యాన్స్ క్లాస్‌లో బేబ్ కింగ్ (6), ఎల్సీ డాట్ స్టాన్‌కాంబ్(7), అలిస్ డా సిల్వా అగ్యియర్ (9) అనే ముగ్గురు చిన్నారులను చంపాడు. హత్యలతో పాటు, రుడకుబానా మరో ఎనిమిది మంది పిల్లలు, ఇద్దరు పెద్దలను గాయపరిచాడు. రుడకుబానా హత్యల వెనక ఎటువంటి రాజకీయ లేదా మతపరమైన ఉద్దేశ్యాలు లేవని.. తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు.
నిందితుడు అత్యంత దిగ్భ్రాంతికరమైన, అత్యంత తీవ్రమైన నేరానికి పాల్పడ్డాడని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి చెప్పారు. చాలా మంది అమ్మాయిలను చంపాలనుకున్నాడు. 15 నిమిషాల్లోనే ముగ్గురు అమ్మాయిలను చంపేశాడని పేర్కొన్నారు. విద్యార్థినుల హత్యకు స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. దాడికి ముందు అతని హింసాత్మక ధోరణిపై అధికారులు విచారించారు.
UK ప్రభుత్వం ఈ దాడిపై బహిరంగ విచారణకు ఆదేశించింది. సంఘటనకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.