47 ఏళ్ల మహిళను డేటింగ్ యాప్ లో కలుసుకున్న 26 ఏళ్ల యువకుడు.. ఆ తర్వాత..

UK man goes to party after stabbing ex-girlfriend to death. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని నాటింగ్‌హామ్‌లో ఒక యువకుడు మాజీ ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Jan 2023 7:33 PM IST
47 ఏళ్ల మహిళను డేటింగ్ యాప్ లో కలుసుకున్న 26 ఏళ్ల యువకుడు.. ఆ తర్వాత..

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని నాటింగ్‌హామ్‌లో ఒక యువకుడు మాజీ ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. నేరం చేసిన తర్వాత పబ్‌కు వెళ్లినట్లు పోలీసులు ధృవీకరించారు. సీసీటీవీ రికార్డింగ్‌ల సాయంతో అతడిని పట్టుకున్నారు. 26 ఏళ్ల జాన్ జెస్సప్ నెవార్క్ నుండి నాటింగ్‌హామ్‌లోని తన మాజీ ప్రియురాలి ఇంటికి 27 కి.మీ పైగా సైకిల్ పై వెళ్ళాడు. ఆమె నివాసానికి చేరుకున్న తర్వాత కత్తితో పొడిచి ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. మృతురాలు 47 ఏళ్ల క్లైర్ అబ్లెవైట్. ఆమె ముగ్గురు పిల్లల తల్లి. హత్య చేసిన తర్వాత జాన్ ఓ పబ్‌కు వెళ్లి ఫుల్ గా మద్యం తాగాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు హత్యకు ఉపయోగించిన ఆయుధం గానీ, ఎవరి రాకకు సంబంధించిన ఆధారాలు కానీ లభించలేదు. అయితే క్లైర్ ఎదురింటి సీసీటీవీ ఫుటేజీలో నిందితుడికి సంబంధించిన ఫుటేజీ ఉంది. దీని ఆధారంగా పోలీసులు జాన్‌ను పట్టుకున్నారు. తర్వాత క్లైర్ మొబైల్ నుండి జాన్ కు మెసేజీలు వెళ్లడాన్ని కూడా కనుగొన్నారు. ఇద్దరూ డేటింగ్ సైట్ ద్వారా కలుసుకున్నారని సమాచారం. కానీ కొన్ని నెలల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత, క్లైర్ వయస్సు అంతరం కారణంగా జాన్‌తో విడిపోయింది. ఇది జాన్ కు కోపం తెప్పించింది. దీంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు. క్లైర్ హత్యకు సంబంధించి నాటింగ్‌హామ్ క్రౌన్ కోర్ట్ జాన్‌కు జీవిత ఖైదు విధించింది.


Next Story