బైక్‌పై వ‌చ్చి సిక్కుల‌పై కాల్పులు.. టార్గెట్ చేశారంటూ..

Two Sikh men shot dead in Pakistan’s Peshawar. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్ నగరంలో ఇద్దరు సిక్కులను ఆదివారం కాల్చి చంపారు.

By Medi Samrat  Published on  16 May 2022 6:22 AM GMT
బైక్‌పై వ‌చ్చి సిక్కుల‌పై కాల్పులు.. టార్గెట్ చేశారంటూ..

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్ నగరంలో ఇద్దరు సిక్కులను ఆదివారం కాల్చి చంపారు. చనిపోయిన వ్యక్తులను దుకాణదారులు రంజిత్ సింగ్ (42), కుల్జీత్ సింగ్ (38) లుగా గుర్తించారు. సర్బంద్ ప్రాంతంలోని బట్టా తాల్ చౌక్‌లోని తమ షాపుల వద్ద కూర్చొని ఉండగా, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్‌బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు.

పాకిస్తాన్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ (PSGPC) సభ్యుడు సత్వంత్ సింగ్ మాట్లాడుతూ.. ఇది పాకిస్తాన్ లో సిక్కులను లక్ష్యంగా జరిగిన హత్యలుగా కనిపిస్తోందని అన్నారు. ఇద్దరూ తమ దుకాణాల వద్ద కూర్చున్నారని.. హంతకులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారన్నారు. టార్గెటెడ్ మర్డర్ ఘటనలా అనిపిస్తోందని అన్నారు. పెషావర్‌లో మైనారిటీ వర్గాలపై దాడులు జరగడం గత ఎనిమిది నెలల్లో ఇది రెండో ఘటన. గత ఏడాది సెప్టెంబరులో, పెషావర్‌లోని ఆసుపత్రి వద్ద సత్వంత్ సింగ్ అనే సిక్కు దుకాణదారుడు కాల్చి చంపబడ్డాడు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్ అనుబంధ సంస్థ, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్(ISIS-K) ఈ హత్యకు బాధ్యత వహించింది.

ఆదివారం హత్య తర్వాత.. పెషావర్‌లోని స్థానిక సిక్కు సంఘం గ్రాండ్ ట్రంక్ రోడ్‌ను దిగ్బంధించి, ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.














Next Story