గే జంటకు బహిరంగ శిక్ష‌

కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేసే ఇండోనేషియాలో గే జంటను కొరడాలతో కొట్టారు.

By Medi Samrat  Published on  27 Feb 2025 5:47 PM IST
గే జంటకు బహిరంగ శిక్ష‌

కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేసే ఇండోనేషియాలో గే జంటను కొరడాలతో కొట్టారు. ఇద్దరు పురుషులు గురువారం నాడు ఇండోనేషియాలోని సంప్రదాయవాద అచే ప్రావిన్స్‌లో బహిరంగంగా కొరడా దెబ్బలు తిన్నారు.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ముస్లిం మెజారిటీ దేశం ఇండోనేషియాలో స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం కానప్పటికీ, ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం.. అచే ప్రావిన్స్ లో నిషేధించారు. ఒక పార్కులో కొరడా దెబ్బలు కొట్టడం మొదలయ్యాయి. సంబంధాన్ని ప్రేరేపించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని 82 సార్లు, రెండవ వ్యక్తిని 77 సార్లు కొరడా దెబ్బలతో శిక్షించారు.

నిర్బంధంలో గడిపిన మూడు నెలల కాలం కారణంగా వీరి శిక్షలలో మూడు కొరడా దెబ్బలను తగ్గించారు. నవంబర్‌లో, స్థానికులు బండా అచేలో అద్దెకు తీసుకున్న గదిపై దాడి చేశారు. ఇద్దరు వ్యక్తులు ఆ గదిలో కలిసి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. లైంగిక సంబంధం నేరం కింద వారిని షరియా పోలీసుల ముందుకు తీసుకెళ్లారు.

Next Story