Video : అమ్మో.. ట్రంప్ ఎలా చూశాడంటే.?

జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో బ్రీఫింగ్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖానికి అనుకోకుండా ఓ మైక్ తగిలింది

By Medi Samrat  Published on  15 March 2025 5:44 PM IST
Video : అమ్మో.. ట్రంప్ ఎలా చూశాడంటే.?

జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో బ్రీఫింగ్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖానికి అనుకోకుండా ఓ మైక్ తగిలింది. ఓ మహిళా జర్నలిస్ట్ మైక్రోఫోన్‌ను ట్రంప్ మొఖం మీదకు పొనిచ్చింది. వైరల్‌గా మారిన ఈ వీడియోలో ట్రంప్ ఆ క్షణంలో ఎంతో కోపంతో చూశాడు. ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తన కనుబొమ్మలను పైకి లేపడం వైరల్ వీడియోలో చూడవచ్చు.

ట్రంప్ వాషింగ్టన్ డిసి నుండి బయలుదేరబోతున్న సమయంలో గాజా పరిస్థితి గురించి ప్రశ్నలకు సమాధానమిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఒక మైక్రోఫోన్ అతని ముఖాన్ని తాకింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు చిరాకుగా చూశాడు. ఇలాంటి విషయాలపై ఎప్పుడూ చురుగ్గా స్పందించే ట్రంప్, "ఆమె ఇప్పుడు టెలివిజన్ స్టార్ అయింది. ఆమె గురించి చర్చించుకోబోతున్నారు" అని చమత్కరించారు.

Next Story