శ్రీరామ్ కృష్ణన్‌ కు కీలక బాధ్యతలు ఇచ్చిన ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ తన టీమ్ లోకి పలువురు భారతీయ అమెరికన్లకు చోటిస్తున్నారు.

By Medi Samrat  Published on  23 Dec 2024 2:00 PM IST
శ్రీరామ్ కృష్ణన్‌ కు కీలక బాధ్యతలు ఇచ్చిన ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ తన టీమ్ లోకి పలువురు భారతీయ అమెరికన్లకు చోటిస్తున్నారు. తాజాగా మరో భారతీయుడికి కీలక పదవిని ఇస్తున్నట్లు ప్రకటించారు. భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త, వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్‌ను తన సలహాదారుగా నియమించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌పై వైట్‌హౌస్ పాలసీ సీనియర్ సలహదారుగా శ్రీరామ్ కృష్ణన్‌ను నియమించినట్టు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. శ్రీరామ్ కృష్ణన్‌ తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించారు. కాంచీపురంలోని ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేసి 2005లో అమెరికాకు వెళ్లారు. ఆయన తండ్రి ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగి కాగా తల్లి గృహిణి. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగిగా 2005లో చేరిన శ్రీరామ్ ట్విట్టర్, యాహూ, ఫేస్‌బుక్, స్పాప్ డీల్ వంటి పలు సంస్థల్లోనూ ఉద్యోగం చేశారు. ట్విట్టర్ ను 2022లో మస్క్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆయనతో కలిసి శ్రీరామ్ కృష్ణన్ పనిచేశారు.

శ్రీరామ్ ట్విట్టర్ లో ట్రంప్ కు థాంక్స్ చెప్పారు. ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్ బృందంలోని పేపాల్ మాజీ సీఈఓ డేవిడ్ ఓ సాక్స్‌తో కలిసి పనిచేయడానికి తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని శ్రీరామ్ కృష్ణన్‌ చెప్పారు.

Next Story