16 ఏళ్ల బ్రెజిలియన్ బాలుడు తన సెల్‌ఫోన్‌ను తీసుకున్నందుకు కోపంతో తల్లిదండ్రులను, సోదరిని కాల్చి చంపాడు. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించారు. సావోపోలోలో గత శుక్రవారం నాడు ఈ ట్రిపుల్ మర్డర్ జరిగింది. బాలుడు పోలీసులకు ఫోన్ చేసి తాను చేసిన క్రైమ్ ను ఒప్పుకోవడంతో సోమవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ టీనేజ్ పిల్లాడిని మృతులైన కుటుంబ సభ్యులు దత్తత తీసుకున్నారు.. అతని తల్లిదండ్రులతో ఫోన్‌కు సంబంధించి వాదన జరిగింది. మునిసిపల్ పోలీసు అయిన తన తండ్రికి చెందిన సర్వీస్ గన్‌ని తీసుకుని కాల్పులు జరిపినట్లు బాలుడు చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత పైకి వెళ్లి తన 16 ఏళ్ల సోదరి ముఖంపై కాల్చాడు. కొన్ని గంటల తర్వాత అతని తల్లి ఇంటికి రాగానే, అదే తుపాకీతో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి వయసు 57, తల్లికి 50 ఏళ్లు. బాలుడు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడాడా లేక.. మరెవరైరి ప్రమేయం ఉందా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం నుండి సోమవారం తెల్లవారుజామున అరెస్టు అయ్యే వరకు యువకుడు మూడు మృతదేహాలతో ఇంట్లోనే పిల్లాడు ఉన్నాడు. ఆ సమయంలో జిమ్‌కి కూడా వెళ్ళాడు.. బేకరీలో కొనుగోలు కూడా చేశాడు. దత్తత తీసుకోడానికి ముందు జువైనల్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్న బాలుడు మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడని అధికారుల విచారణలో తేలింది.